బిసిల్లారా ఇకనైనా మేల్కోండి…సకలజనుల తరహాలో ఉద్యమిద్దాం…బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు, బిసి జెఏసి చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్
నర్సంపేట, మన ధ్యాస, అక్టోబర్ 23:వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బిసి సంక్షేమ సంఘం పట్టణ కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్, డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ హాజరై బిసి రిజర్వేషన్ల పోరాటం రాష్ట్రంలో రోజు రోజుకు ఉదృతం అవుతున్న సందర్భంగా బిసిలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు బిసి రిజర్వేషన్ల పోరాటం ఉగ్రరూపం దాలుస్తుందని ఈ అవకాశాన్ని ఒడిసి పట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వనుకు పుట్టే విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సకలజనుల సమ్మె తరహాలో బిసి జెఏసి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల జెండాలు పక్కన పెట్టి బిసి జెఏసి ఆధ్వర్యంలో బిసి జెండాలు పట్టుకుని రిజర్వేషన్లు సాధించుకునే వరకు ఉద్యమం చేసే సమయం ఆసన్నమైనదని అన్నారు. వరంగల్ గడ్డ అంటేనే పోరాటాల పురిటిగడ్డ అని అందులో నర్సంపేటకు ప్రత్యేక స్థానం ఉంటుందని గుర్తుచేశారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా బిసి లు కులాలకు అతీతంగా మేల్కోని 42 శాతం రిజర్వేషన్ల పోరాటంలో ఇప్పటికైనా బిసి లు రాజకీయ పార్టీలకు అతీతంగా జెండాలు పక్కన పెట్టి కులాలకు అతీతంగా అందరూ ఏకమై బిసి జెండాలు పట్టుకుని ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నూరి రవి ముదిరాజ్, జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్, బీసీ కార్మిక సంఘం నాయకులు బండి వెంకటేశ్వర్లు, చెన్నారావుపేట మండల మహిళా అధ్యక్షురాలు బండి విజయ, నర్సంపేట పట్టణ కార్యదర్శిలు గాండ్ల శ్రీనివాస్, శీరంశెట్టి రాజేందర్ లు పాల్గొన్నారు.








