కలిగిరి అక్టోబర్ 23 :(మన ధ్యాస న్యూస్)://వీర్నకొల్లు గ్రామానికి చెందిన లెక్కల రమణమూర్తి – విజయలక్ష్మి దంపతుల కుమారుడు జస్వంత్ గంధపు నలుగు కార్యక్రమం ఘనంగా ఆనందభరిత వాతావరణంలో సంతోషంగా, సాంప్రదాయ బద్ధంగా జరిగింది. ఈ గంధపు నలుగు వేడుకలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ హాజరై, వరుడు జస్వంత్‌కు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన జస్వంత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, జీవితంలో అన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే, లెక్కల వారి కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా కొంత సమయం ముచ్చటించి, వారి సంతోషాన్ని పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు, మండల అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి,గ్రామ ప్రజలు, బంధుమిత్రులు, ఆత్మీయులు పాల్గొని వరుడును ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *