నెల్లూరు మూలపేటలోని మూలస్థానేశ్వర స్వామి వారిని తన కుమార్తె షరణితో కలిసి దర్శించుకున్న మంత్రి.
మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 23:నెల్లూరు మూలపేట మూలస్థానేశ్వర ఆలయంలో వైభవంగా కార్తీకమాస పూజోత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ తన కుమార్తె షరనీతో కలిసి ఆకాశ దీపోత్సవంలో పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ఈవో, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆకాశ దీపం వెలిగించి, శివయ్య సన్నిధిలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ మాట్లాడుతూ… మూలాపేట శివాలయంలో ఆకాశదీపం వెలిగించటం నా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. 11 వ శతాబ్దంలో ముక్కంటి రెడ్డి రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని, చోళ రాజుల కాలంలో రాతికట్టడాలు కట్టారని తెలిపారు. నెల్లిచెట్టు కింద స్వామి వారు వెలియటంతో నెల్లూరు అనే పేరు వచ్చిందన్నారు. కార్తీకమాసం పొడవునా మహిళలు ఉపవాసం ఉండి భక్తి శ్రద్దలతో దీపాలు వెలిగిస్తారని తెలిపారు. కార్తీకమాసం మొదటి రోజు వెలిగించే కార్తీక దీపం ఎంతో పవిత్రమైందన్నారు. సమాజంలోని అజ్ఞానపు చీకట్లు తొలగిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. పితృదేవతలకు ఆకాశదీపం మార్గం చూపిస్తుందన్నది భక్తుల విశ్వాసంగా భావిస్తారు. కేదారేశ్వర వ్రతాలు ఎక్కువగా ఈ మాసంలో జరుపుకుంటుంటారని, కార్తీక శోభతో ప్రజల జీవితాలు మరింత కాంతివంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఆర్ధికంగా నష్టపోయిన రాష్ట్రం సీఎం చంద్రబాబు నాయుడి సారధ్యంలో అభివృద్ధి చెందాలని పరమశివుడిని ప్రార్థిస్తున్నానన్నారు. అనంతరం మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి మాట్లాడుతూ….. మా నాన్నతో, టీడీపీ కుటుంబంతో ఆకాశ దీపోత్సవంలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. మూలాపేట శివాలయంలో కార్తీకమాస పూజలు నిర్వహిస్తే కోర్కెలు తీరుతాయన్నది భక్తుల ప్రఘాఢ విశ్వాసం అని తెలిపారు. మూలస్థానేశ్వర స్వామి ఆశీస్సులతో అందరికీ ఉండాలని కోరుకొంటున్నానన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఆదరించిన రాష్ట్ర ప్రజలకు అంతా మంచే జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ , టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ,మాజీ మున్సిపల్ చైర్పెర్సన్ తాళ్ళపాక అనూరాధ ,మాజీ జెడ్పిటీసీ విజేతా రెడ్డి ,టీడీపీ ,జనసేన ,బీజేపీ నేతలు పాల్గొన్నారు .








