

ఎల్ బి నగర్ , మన న్యూస్:- ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లోని రెడ్ ట్యాంక్ రోడ్ లోని రత్నదీప్ సూపర్ మార్కెట్ ఎదురుగా కావ్య,అనూష నేతృత్వంలోని ది గ్రానియోస్ కిచెన్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి,వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ తమవద్ద పిజ్జా బర్గర్స్,ఫ్రైడ్ చికెన్,పాస్టాస్, మిల్క్ షేక్స్ పంటివి అందరికీ అందుబాటు ధరల్లో లభిస్తాయి అన్నారు. ఓపెనింగ్ ఆఫర్ గా డిసెంబర్ 10, 2024 వరకు 30% డిస్కౌంట్ కూడా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.