కలిగిరి , సెప్టెంబర్ 26: (మనధ్యాస న్యూస్)ప్రతినిధి, నాగరాజు :////

ఉదయగిరి మాజీ శాసన సభ్యులు బొల్లినేని వెంకట రామారావు గారు తన స్వగ్రామమైన కలిగిరి మండలంలోని పెద్దపాడు గ్రామంలో నూతన గృహ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.శంకుస్థాపన అనంతరం వెంకట రామారావు మాట్లాడుతూ, “పుట్టిన గ్రామంలోనే నివాసం ఏర్పరచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నా జీవితంలో ఒక ప్రత్యేక ఘట్టం,” అని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *