మన సినిమా: సాకే రామయ్య సమర్పణలో, సిద్ద క్రియేషన్ బ్యానర్‌పై సత్య మార్క దర్శకత్వంలో, నిర్మాత సాకే నీరజ లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమలో రెండోసారి’. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ అగ్ర దర్శకుడు తేజ చేతుల మీదుగా ఇటీవల విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ –“‘ప్రేమలో రెండోసారి’ టీజర్ చాలా బాగా వచ్చింది. ప్రేమ అనే భావన ఈ భూమి ఉన్నంతవరకు ఎప్పటికీ చావదు. ప్రేమ కథలు ఎప్పటికీ ఆదరణ పొందుతూనే ఉంటాయి. ఈ చిత్రానికి మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను. మొత్తం టీంకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని అన్నారు.

హీరో రమణ సాకే మాట్లాడుతూ –
“లవ్ కంటెంట్‌తో ఎన్నో విజయాలు సాధించిన తేజ చేతుల మీదుగా మా సినిమా టీజర్ విడుదల కావడం ఒక ప్రత్యేక యాదృచ్ఛికం. తేజ చిత్రాల మాదిరిగానే మా సినిమా కూడా మంచి సక్సెస్ సాధిస్తుందని నమ్మకం ఉంది. ఈ సినిమాలో ప్రేమ మాత్రమే కాకుండా ఎమోషన్స్, సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి. ట్రెండ్‌కి తగ్గట్టుగా తెరకెక్కించినందుకు దర్శకుడికి అభినందనలు” అని అన్నారు. దర్శకుడు సత్య మార్క మాట్లాడుతూ –“మా సినిమా నేటి యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయింది. అక్టోబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్నాం. చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించే చిత్రంగా నిలుస్తుందని నమ్మకం. ఎంతో గొప్ప మనసుతో తేజ అడిగిన వెంటనే టీజర్ లాంచ్‌కు అంగీకరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు” అన్నారు. హీరోయిన్ వనిత గౌడ మాట్లాడుతూ “ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మనసుకు హత్తుకునేలా ఉంది. కెమెరా వర్క్ చాలా బాగా వచ్చింది. స్టోరీ, మ్యూజిక్ ద్వారా ప్రేక్షకులందరూ మైమరచి సినిమాకు కనెక్ట్ అవుతారని నమ్మకం ఉంది” అని తెలిపారు. ఈ చిత్రంలో హీరో రమణ సాకే, హీరోయిన్ వనిత గౌడతో పాటు జబర్దస్త్ శ్రీను, బాబీ, దుర్గారావు, జబర్దస్త్ ఫణి, రాణి, సతీష్ సారపల్లి, చిరంజీవి, విక్టర్, ప్రదీప్, బి.ఎస్. మన్యం, సురేష్ తదితరులు నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *