బేటి బచావో- బేటి పడావోపై అవగాహన కల్పించిన జిల్లా పి.ఓ. జాగరపు విజయ…


శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- బాలికలకు రక్షణ మరియు అభివృద్ధి ప్రాముఖ్యమని ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ ఆఫీసర్ జాగరపు విజయ బాలికలకు సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రం శంఖవరంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలో బేటి బచావో- బేటి పడావో అవగాహనా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ పధకం సంచాలకురాలు సి.హెచ్.లక్ష్మి ఆదేశాల మేరకు శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ. పర్వత వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహనా కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ ఆఫీసర్ జాగరపు విజయ పలు అంశాలను విద్యార్థినిలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ బాలల హక్కులు, బాలికలు వారు జీవించే, రక్షణ పొందే, అభివృద్ది చెందే, పాల్గొనే హక్కుల గురించి వివరించారు. లైంగిక వేధింపులు, మంచి, చెడు స్పర్శలు, బాలల చట్టాలను గురించి తెలిపి అత్యవసర పరిస్థితుల్లో బాలల హెల్ప్ లైన్ 1098 కి ఫోన్ కాల్ చేయాలని చైల్డ్ హెల్ప్ లైన్ 1098 పని తీరు గురించి వివరించారు. ఈ నెంబర్ కు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారని తెలిపారు. అదేవిధంగా యువతికి18, యువకునికి 21 సంవత్సరాల వయస్సు నిండకుండా వివాహ చేసినట్లు అయితే బాల్య వివాహం నిర్మూలన చట్టం ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 1,000,00 ల జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బి.బాలా మణి కుమారి మాట్లాడుతూ విద్యార్థులందరూ బాలల హక్కులు, చట్టాల పైన పూర్తి అవగాహన ఏర్పరచుకొని వారి జీవితంలో మంచి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, జీవనోపాధి రంగాల్లో స్థిరపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్యదర్శి డి.భవిత, పాఠశాల ఉపాధ్యాయినిలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *