

మన ధ్యాస, నిజాంసాగర్, (జుక్కల్) ప్రజల సౌకర్యార్థం కోసం 15వ ఆర్థిక సంఘం నిధులతో కలిపి ఎస్ బిఎం కింద 5 లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపడుతున్నామని. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు.
పెద్ద కోడప్ గల్ మండల కేంద్రంలోని ఆయుర్వేదిక్ ఆసుపత్రి ఆవరణలో సామూహిక మూత్రశాల నిర్మాణానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామూహిక మూత్రశాలలో త్వరగా పూర్తిచేస్తే ప్రజలకు ఎంతో సౌకర్యార్థం ఏర్పడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ ఎపిఓ సుదర్శన్, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మార్కెట్ కమిటి డైరెక్టర్ లు నాగనాథ్,జిన్నా రాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిప్ప మోహన్,
సురేష్,మల్లప్ప పటేల్, మొగుల గౌడ్,పండరీ,చాంద్ పాషా,రహీం,నాగు,శ్రీనివాస్ గౌడ్,విఠల్ తదితరులు పాల్గొన్నారు.