మన ధ్యాస, నెల్లూరు ,ఆగస్టు 25:నెల్లూరు 4 వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్ లో డివిజన్ స్థాయి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో వైస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు సమక్షంలో ఇంచార్జ్ సందాని , కో ఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిహాజరై రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూ ఆర్ కోడ్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిన మోసాలను పలువురు నేతలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…………. చంద్రబాబు నాయుడు ప్రజలకు మోసపు హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను నట్టేట ముంచారని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఈ రోజు హామీలపై ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సిపి నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ పాలన సాగిస్తూ.. వైఎస్ఆర్ సీపీ నేతలపై అక్రమ అరెస్టులకు పాల్పడుతూ .. దుర్మార్గపు పాలన సాగిస్తుందన్నారు. పోలీసులు కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా మారి తెలుగుదేశం పార్టీ చెప్పిన వారిపై చెప్పిన విధంగా అక్రమ కేసులు బనాయిస్తూలా అండ్ ఆర్డర్ ను పహస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తూ కూటమి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి తప్పు చేశామన్న భావన ప్రజలందరిలో ఉందని మరోసారి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ పెర్నెటి కోటేశ్వర రెడ్డి, 3 వ డివిజన్ ఇన్ చార్జ్ నారాయణరెడ్డి, 5 వ డివిజన్ ఇన్ చార్జ్ సుబ్బారెడ్డి,5 వ డివిజన్ కోఆర్డినేటర్ ఇబ్రహీం, డివిజన్ నాయకులు సుభాహని, జీలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *