

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం పట్టణంలో శ్రీ కామాక్షి కార్పెంటర్ అసోసియేషన్ వద్ద 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కార్పెంటర్ యూనియన్ అధ్యక్షుడు సేనాధిపతి రాజుబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి సీనియర్ నేత,కౌన్సిలర్ అలమండ చలమయ్య హాజరయ్యారు.తొలుత జెండా ఆవిష్కరించారు.అనంతరం చలమయ్య మాట్లాడుతూ బ్రిటిష్ వారు నుండి అనేకమంది స్వాతంత్ర సమరయోధులు ప్రాణ త్యాగాలు చేసి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగిందని ఆయన అన్నారు.అలాగే కార్పెంటర్స్ అసోసియేషన్ సభ్యులకు ఎటువంటి అవసరం వచ్చిన ముందుండి నడిపిస్తానని నేను మీలో ఒకడిని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు జామి ఆదినారాయణ,సెక్రెటరీ దుద్దుపూడి ఏసు,సలహాదారులు వింజరపు వరప్రసాద్,కిల్లంపల్లి శ్రీను, సింహాద్రి బ్రహ్మం,ట్రెజరర్ కొమ్మోజు తాతాచారి, తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.