

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలేశ్వరం నందు 79వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల నేపథ్యంలో దేశంలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడలని. భారత ప్రభుత్వం ప్రారంభించిన‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో దేశ ప్రజలంతా భాగం పంచుకోవాలని. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరేయాలని,జాతీయ పతాకంతో దేశ ప్రజల అనుబంధాన్ని మరింత పెంచుకోవాలని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపుమేరకు కళాశాల విధ్యార్దిని, విధ్యార్ధులు,అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఏలేశ్వరం నగర వీధులలో జాతీయ జెండాతో భారత మాత,భారత దేశ ఔదార్యం, భారత దేశం నందు భిన్నత్వంలో ఏకత్వం,స్వతంత్ర సముపార్జనలో ప్రాణాలు అర్పించిన నాయకుల జోహార్లు ఆర్పిస్తు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. సునీత, వైస్ ప్రిన్సిపల్ కె వేంకటేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. ప్రయాగ మూర్తి ప్రగడ, అధ్యాపకులు లక్ష్మి,వీరభద్రరావు, డా. బంగార్రాజు, సతీశ్, రాజేశ్, కుమారి, మేరీ రోజలీనా, పుష్పా, అధ్యాపకేత సిబ్బంది పెద్ద సంఖ్యలో విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.