

ఎస్ ఆర్ పురం , మన న్యూస్.. రోగులకు అన్నదానం చేయడం మహాభాగ్యం అని ఆరిమాకులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి చరణ్ అన్నారు సోమవారం ఆరిమాకులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది అలాగే గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఎదుగుదలకు చాలా మేలు జరుగుతుందని తెలియజేశారు అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కేశవరెడ్డి ఆధ్వర్యంలో రోగులకు మధ్యాహ్నం కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఝాన్సీ,ఏఎన్ఎం శకుంతల ఎమ్ ఎల్ హెచ్ పి లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.