విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని “లులూ షాపింగ్ మాల్” కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 137 ను రద్దు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తాం……… ఏపీ పిటిడి( ఆర్టీసీ)ఎంప్లాయిస్ యూనియన్ నెల్లూరు జిల్లా శాఖ

మన న్యూస్ నెల్లూరు ,ఆగస్టు 9 :*ఆర్టీసీ ఆస్తులు కాపాడుకొనేందుకు ఆర్టీసీలోని అన్ని సంఘాలు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి. *ప్రజా రవాణా సంస్థ (ఆర్టీసీ) ఆస్తులు ప్రైవేట్ వ్యాపారవేత్తలకు ధార దత్తం చేస్తున్న చర్యలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలి. విజయవాడ నగర నడిబొడ్డున ఉన్న ఏపీఎస్ఆర్టీసీ గవర్నర్ పేట 1&2 డిపోలు మరియు పాత బస్టాండ్ కు సంబంధించిన 4.15 ఎకరాల స్థలం విలువ సుమారు 400 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఈ స్థలాన్ని లులూ షాపింగ్ మాల్ ప్రభుత్వం కట్టిపెట్టి దశాబ్దాలుగా ప్రజలకు రవాణా సౌకర్యాలు అందిస్తూ అందుబాటులో ఉన్న రెండు డిపోలలోని 200 బస్సులను 1100 మంది ఉద్యోగులను ప్రజలకు దూరం చేస్తూ బడా వ్యాపారవేత్తలకు జీవో ఎంఎస్ నెంబర్ 137 ద్వారా కట్టబెట్టిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏపీ పి టి డి (ఆర్ టి సి) ఎంప్లాయ్ యూనియన్ నెల్లూరు జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న యూనియన్ నాయకులు మాట్లాడుతూ …… విజయవాడ గవర్నర్ పేట డిపోలు 1&2, పాత బస్టాండ్ స్థలాన్ని 1959 లో అప్పటి ప్రభుత్వం నిర్దేశించిన ధర గజం 16 రూపాయలతో సుమారు 4 లక్షల 6 వేల రూపాయలకు ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేసింది అని అన్నారు. ఈ స్థలాన్ని ఇప్పటి ప్రభుత్వం పెద్దలు ప్రైవేట్ వ్యాపారవేత్తలకు దారా దత్తం చేసేందుకు తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలి డిమాండ్ చేశారు.ఈ ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్ కు అభివృద్ధి చేస్తే పనిలో భాగంగా లులూ షాపింగ్ మాల్ ను నగర శివారు ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంత అభివృద్ధి చెందుతుంది. అలా కాకుండా నగర నడిబొడ్డున నిరంతరం రద్దీగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్న పాత బస్టాండ్ కు అనుబంధం ఉన్న డిపోలలో ఉన్న బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రేపు ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు పథకం అమలతో ఆ సంఖ్య రెట్టింపు అవ్వనున్నది . ఇటువంటి తరుణంలో ఈ డిపోలను ఇక్కడ నుండి తొలగించడం వల్ల ప్రజలకు త్రీవ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కావున జీవో నెంబర్ 137 ను తక్షణమే వెనుక తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము అని అన్నారు. గతంలోని ఈ ప్రభుత్వం పెద్దలే 2014 సంవత్సరంలో విజయవాడ సమీపంలో ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాల స్థలం 29 ఎకరాలను హెచ్.ఐ.ఎల్ కంపెనీ కట్టపెట్టారు. అందుకు ప్రభుత్వం ఇస్తానన్న స్థలం ఇప్పటివరకు ఒక గజం కూడా ఇవ్వలేదని ,అంతేకాకుండా 2017 లో అదే గవర్నర్ పేట 1&2 డిపోలు బఫర్ జోన్ కాలు గట్టుపై ఉన్నాయని ఇంటర్నేషనల్ పార్కుగా అభివృద్ధి చేస్తామని దీనిని అప్పట్లో ప్రైవేట్ వ్యక్తులకు కట్టపెట్టాలని చూస్తే అప్పట్లో ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు కలిసి జేఏసీగా పోరాటం చేసి అడ్డుకున్నాయి అని గుర్తు చేశారు .కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అందరు ఉద్యోగాలు లాగే ఆర్టీసీ ఉద్యోగులు కోరుకున్నాము. కానీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన డిఎ బకాయిలను చెల్లిస్తాము ,12 పి.ఆర్.సి కమిషన్ వేస్తాము ఐ. ఆర్ కూడా ఇస్తామన్న హామీల అమలు విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పై ఎంప్లాయిస్ యూనియన్ గా ఖండిస్తున్నాము అని అన్నారు.భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీలో విద్యుత్తు బస్సులను ప్రవేశపెట్టడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాము అని అన్నారు. ఇప్పటికె అలిపిరి డిపోలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశ పెట్టడం జరిగింది అని అన్నారు. ఆగస్టు15 నుండి స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడానికి స్వాగతిస్తున్నాము. ఈ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా ప్రవేశ పెడుతూ వారికి ఆర్టీసీ డిపోలను అప్పచెప్పడాన్ని రానున్న కాలంలో మరో 19 డిపోలలో ఇదే విధానం ప్రవేశ పెడుతూ ఆర్టీసీ డిపోలను, స్థలాలను ప్రైవేటు ఆపరేటర్లకు కట్టబట్టాలనే ఆలోచనలను ఎంప్లాయిస్ యూనియన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము అని అన్నారు.సంస్థను ప్రైవేటీకరణ వైపు నడిపించచే ఇటువంటి చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు. ప్రభుత్వమే సంస్థకు ఆర్థిక సహాయం చేసి సంస్థ నేరుగా ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసి నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాము అని అన్నారు . దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని నిర్వీరం చెయ్యాలని చూడడం చాలా బాధాకరమని , ఆర్టీసీని కాపాడుకునేందుకు రాష్ట్ర నాయకత్వం నుండి ఏ పోరాటానికి పిలుపు ఇచ్చిన మేము సిద్ధంగా ఉన్నాము అని యూనియన్ నాయకులు ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.ఈ విలేకరుల సమావేశంలో ఎంప్లాయిస్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ జి. నారాయణరావు, జిల్లా కార్యదర్శి ఓ. వి ప్రసాద్ ,ఎం పాపయ్య నాన్ ఆపరేషన్ అధ్యక్షులు; బి. మాలాద్రి జిల్లా జాయింట్ సెక్రెటరీ; ఏ .వెంకటేశ్వర్లు జిల్లా ఉపాధ్యక్షులు; వి ఎస్ రావు జిల్లా పబ్లిసిటీ సెక్రటరీ; ఎం. పెంచలయ్య నెల్లూరు 1 వ డిపో కార్యదర్శి ; కె .ప్రసాద్ నెల్లూరు 2 వ డిపో కార్యదర్శి పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు