మన న్యూస్,నెల్లూరు, ఆగస్టు 1: నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మాజీమంత్రి పోలు బోయిన అనిల్ కుమార్ యాదవ్ అక్రమ అరెస్ట్ విషయంపై శుక్రవారం ఉదయం రాష్ట్ర యాదవ మహాసభ నాయకులు యనమల నాగేశ్వరావు యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించినారు.ఈ సందర్భంగా యనమల నాగేశ్వరావు యాదవ్ మాట్లాడుతూ…… ప్రజా క్షేత్రంలో పరిపాలన ముఖ్యంగానీ సాధింపుల రాజకీయాలు చేయటం సరికాదు మాజీ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ తరుపున ఏమైనా తప్పులు జరిగి ఉంటే ఎంక్వయిరీ వేసి దాని ప్రకారం చర్యలు తీసుకుంటే మేము కూడా దానికి సమర్థిస్తాము అని అన్నారు. అలా కాకుండా అనిల్ కుమార్ యాదవ్ ఇబ్బంది పెడితే ,అక్రమ అరెస్టు చేస్తే ఉపేక్షించేది లేదు అని అన్నారు. తప్పు ఎవరు చేసిన తప్పే .తప్పు చేసి ఉంటే కేసులు పెట్టండి దానికి ఎవరు ఎదురు చెప్పరు అని అన్నారు .అనిల్ కుమార్ యాదవ్ నాన్న తిరుపాల్ యాదవ్, చిన్నాన్న సుధాకర యాదవ్, తాత సుందర యాదవ్ తో చిన్నప్పటినుండి నాకు పరిచయం ఉంది అని అన్నారు. నాకే కాదు రాష్ట్రంలో యాదవులందరికి పోలుబోయిన కుటుంబ విషయం తెలుసు అని అన్నారు . అవినీతి అనిల్ కుమార్ బ్లడ్ లోనే లేదు, అవినీతిని ప్రోత్సహించడు అని అన్నారు. వైట్ క్వార్ విషయంలో ఏవైనా తప్పులు చేసి జరిగి ఉంటే , రుజువులు ఉంటే అరెస్టు కు మేము సమతమే అని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వ సాధారణమే అని అన్నారు. కానీ ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అనిల్ కుమార్ ను అక్రమ అరెస్టు చేస్తే ఊరుకోము అని అన్నారు.
