మన న్యూస్: ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ రథసారథి పోరాటయోధుడు కామ్రేడ్ పోటు ప్రసాద్ అకాల మరణం అనంతరం ఖమ్మం సిపిఐ గిరి ప్రసాద్ భవన్ లో ఏర్పాటుచేసిన పోటు ప్రసాద్ పార్థివదేహానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పాయం పోటు ప్రసాద్ సంతాప సభలో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన కుటుంబం ప్రసాద్ రావు కుటుంబమని విద్యార్థి దశ నుంచి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా సిపిఐ నాయకుడిగా ప్రజలకు అనేక సేవలను అందించారని ఈరోజు వారి సంతాప సభను ఏర్పాటు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయమైనా కానీ జననం మరణం అనేది సృష్టి ధర్మంలో భాగం అయినప్పటికీ ప్రసాద్ రావు భౌతికంగా ప్రజల్లో లేకపోయినా వారు చేసినటువంటి అనేక ఉద్యమ పోరాటాలు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ప్రసాద్ రావు కి మరొకసారి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, సిపిఐ సీనియర్ నాయకులు పెద్దబ్బాయి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య, సిపిఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *