

గూడూరు, మనం న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పొలం పిలుస్తుంది కార్యక్రమము ను రామలింగాపురం మరియు మిట్టాత్మకూరు గ్రామాలలో నిర్వహించడం జరిగింది.. వ్యవసాయ అధికారి , గూడూరు వి. రమేష్ మాట్లాడుతూ పంట కి అవసరమైన మేరకే రసాయన ఎరువులు, పురుగు మందులు వాడాలని, అధిక రసాయనాలతో భూమి కలుషితమై నిస్సారమవుతుందని తెలిపారు . . ఖరీఫ్ 2025 కి సంబంధించి పంట నమోదు చేయడం జరుగుతుందని కావున ప్రతి రైతు మీరు సాగు చేసే పంట వివరాలను రైతు సేవా కేంద్రం సిబ్బందికి తెలిపి పంట నమోదు చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రామలింగాపురం, మిట్టాత్మకూరు గ్రామ వ్యవసాయ సహాయకులు కళ్యాణి ,శివ శంకర్ మరియు రైతులు పాల్గొన్నారు.
