మాట్లాడుతున్న ఐ సి డి ఎస్ సీ డిపివో మహబూబ్

గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలంలోని పారిచర్ల రాజుపాళెం గ్రామం లోని అంగన్వాడీ కేంద్రం నందు మంగళవారం కిశోర బాలికల వికాసంపై ఐసిడిఎస్‌ సిడి పివో మెహబూబ్ ఆధ్వర్యంలో సి డి పి వో శారదమ్మ అధ్యక్షతన విద్యార్థినులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీ డిపివో మహబూబ్ మాట్లాడుతూ . కిషోర బాలికల వ్యక్తిత్వ వికాసం వద్ధి చెందేలా అందరూ సమిష్టిగా కషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో వ్యక్తిగత ఆరోగ్యం, రక్త హీనత, మహిళా అక్రమ రవాణా, లింగ వివక్ష, బాల్య వివాహాలు నిర్మూలనకు తీసుకోవలసిన జాగ్రత్తలను వారువివరించారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను అంగన్వాడీ కార్యకర్తలు లు తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు స్వరూప రాణి, అంగన్వాడీ కార్యకర్త కవిత, హెల్త్ డిపార్ట్మెంట్ అరుణ, ఏ ఎన్ ఏం కుమారి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *