• బీఎస్పీ ప్రత్తిపాడు ఇంచార్జ్ గునపర్తి అపురూప్
  • విజయవాడలో బీఎస్పీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న కాకినాడ జిల్లా నియోజకవర్గాల ఇన్చార్జిలు..

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే బీఎస్పీ నీలిరంగు జెండా ఎగరాలని ప్రత్తిపాడు నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జ్ గునపర్తి అపురూప్ అన్నారు. ఆదివారం విజయవాడ మాకినేని బసవ పున్నయ్య భవన్ ప్రైవేట్ కార్యాలయంలో బీఎస్పీ జోన్, జిల్లా,మరియు అసెంబ్లీ కమిటీల సమీక్షా సమావేశం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ రాజ్యసభ ఎంపీ, బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ రాజా రామ్, మాజీ ఎమ్మెల్సీ, బహుజన్ సమాజ్ పార్టీ సెంట్రల్ కోఆర్డినేటర్ అతర్ సింగ్ రావ్ పాల్గొన్నారు. బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్ బాలయ్య సభ అధ్యక్షత వహించారు. అనంతరం
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో రాష్ట్రంలో గల అన్ని జిల్లాల కమిటీలు మరియు నియోజకవర్గ కమిటీలు పర్యవేక్షించడం జరిగింది. దానిలో భాగంగానే కాకినాడ జిల్లా కమిటీ మరియు నియోజకవర్గల కమిటీలను పర్యవేక్షించారు. అనంతరం జిల్లాలో గల ప్రతి నియోజకవర్గం కమిటీల బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జ్ గునపర్తి అపురూప్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో గల వివిధ సమస్యలను రాష్ట్ర కార్యవర్గానికి తెలియజేయడం జరిగిందని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు రాజ్యాధికారం చేపట్టాలంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలు కలిగి మాన్యవర్ కాన్సిరాం స్థాపించిన బహుజన సమాజ్ పార్టీ అధికారం చేపట్టాలని అన్నారు. దేశ అభివృద్ధి చెందాలంటే నాలుగు దఫాలుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి ప్రజలకు సేవలు అందించిన బెహింజి మాయావతి ప్రధానమంత్రి కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ బీఎస్పీ కార్యవర్గం, రాష్ట్రం లో గల వివిధ జిల్లాల ఇన్చార్జులు, అసెంబ్లీ ఇన్చార్జులు, మరియు బీఎస్పీ కాకినాడ జిల్లా ఇంచార్జ్ తంతట కిరణ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖండవల్లి లోవరాజు, కాకినాడ జిల్లాలో గల నియోజకవర్గ ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *