Oplus_0

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బంజేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో “డ్రై డే – ఫ్రైడే” కార్యక్రమం పురస్కరించుకుని పరిసరాల పరిశుభ్రతపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.ఈ సందర్భంగా ఎంపీడీవో గంగాధర్ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పరిశుభ్రత పట్ల జాగ్రత్త వహించాలని, నిల్వ నీరు వ్యాధులకు కేంద్రంగా మారనీయకూడదని హెచ్చరించారు.ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలని సూచించారు.
అనంతరం సీజనల్ వ్యాధుల నివారణపై కాలనీల్లో తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భీమ్రావు, హెల్త్ సూపర్ వైజర్ ఫర్జానా,అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు,ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Oplus_0

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *