Oplus_131072

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ గేట్ సమీపంలోని పిఎసిఎస్ ఫంక్షన్ హాల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అచ్చంపేట్ సహకార సంఘం చైర్మన్ నర్సింహ రెడ్డి,వైస్ చైర్మన్ గుమస్తా శ్రీనివాస్,సీఈఓ సంగమేశ్వర్ గౌడ్ పాల్గొని మొక్కలు నాటి నీరు పోశారు.
ఈ సందర్భంగా చైర్మన్ నర్సింహ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పచ్చదనానికి హరితహారం ప్రధాన సాధనం. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలి అని పేర్కొన్నారు. ఫంక్షన్ హాల్ ఆవరణంలో మొత్తం 100 మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.ఈ మొక్కలు పెద్దవిగా పెరిగే వరకు స్వయంగా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *