oplus_2
oplus_2

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూన్ 25: మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం ఎంఈఓ అమర్ సింగ్ పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను పరిశీలించి, ప్రధానోపాధ్యాయుడు సాయి రెడ్డిని విద్యా బోధన, నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఎంఈఓ పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నిబంధనల ప్రకారం నిష్కలంకంగా మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలోనే ఉన్న ఒక భవనం పూర్తిగా కూలిన స్థితిలో ఉందని,విద్యార్థులకు ప్రమాదకరంగా మారుతున్నదని ఎంఈఓ దృష్టికి ఉపాధ్యాయులు తీసుకువచ్చారు.సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని ఇచ్చారు. పాఠశాల చుట్టుముట్టు ప్రహరీ గోడను నిర్మాణం చేసే విధంగా చూడాలని అన్నారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరగకుండా శానిటేషన్ చేయించాలని ఎంఈఓ సూచించారు.

oplus_2

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *