• విద్యార్థులకు అభినందనలు తెలిపిన ప్రిన్సిపాల్ కనిగిరి విశ్వేశ్వరరావు…

తుని మన న్యూస్ (అపురూప్) తుని గురుకులంలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు శ్రీకాకుళంలోని ఐ.ఐ.ఐ.టి లో సీట్లను కైవసం చేసుకుని ప్రతిభను కనబరిచారని తుని అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపల్ కనిగిరి విశ్వేశ్వరరావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యదర్శి సూర్య సునీల్ రాజ్, చంద్ర సంజీవ్ రావు, మరియు మురళీ కృష్ణ ప్రోత్సాహంతోనే ప్రతిభను కనబరిచారని తుని గురుకులం పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. భావితరాల భవిష్యత్తు చక్కటి విద్యతోనే సాధ్యమని, గమ్యం చేరాలంటే ఉన్నత లక్ష్యం తో ముందడుగు వేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *