గూడూరు ,మన న్యూస్ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధన పాటించుకుంటే చర్యలు తప్పవని ఒకటవ, రెండవ పట్టణ సిఐలు శేఖర్ బాబు, శ్రీనివాసులు హెచ్చరించారు. బుధవారం సాయంత్రం ఒకటో పట్టణ సర్కిల్ కార్యాలయంలో పట్టణ, రూరల్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లను ఉద్దేశించి వారు మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న సందర్భంలో జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, గూడూరు డి ఎస్పీ గీతా కుమారి సూచనలు మేరకు ట్రాఫిక్ ను ఒకటో పట్టణం నుండి రెండో పట్టణానికి వెళ్లే ఆటోలను ఒకటవ రైల్వే వంతెన నుండి రెండవ పట్టణానికి వెళ్లాలని, రెండవ పట్టణం నుండి వచ్చే ఆటో లు రెండవ రైల్వే వంతెన ద్వారా పట్టణంలోకి ప్రవేశించాలని అదేవిధంగా సాధుపేట నుండి వచ్చే ఆటోలు వాటర్ ట్యాంక్ మీదుగా పట్టణంలోకి రావచ్చని ఆటో డ్రైవర్లకు సూచించారు. రైల్వే స్టేషన్ నుండి సంఘం థియేటర్ వరకు రోడ్డు కిరువైపులా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఆటోలను నిలుప రాదని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పట్టణ ఎస్సై తిరుపతయ్య, సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *