శంఖవరం మన న్యూస్ (అపురూప్):- కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ స్వర్గీయ మంగం ప్రభుదాసు ని స్మరణతో ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో కత్తిపూడి పద్మావతి కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంటి వైద్యులు కొంగు రమేష్ మాట్లాడుతూ, కంటి వైద్య శిబిరానికి గ్రామంలో గల 120 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని, వారిలో కంటి ఆపరేషన్లు కొరకు 15 మందిని గుర్తించి త్వరలో ఆపరేషన్లు చేయించడం జరుగుతుందన్నారు. అనంతరం కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారు కత్తిపూడి జార్జి చిన్నపిల్లల ఆసుపత్రి పక్కన పద్మావతి కంటి ఆసుపత్రిని సంప్రదించాలని కోరారు. తక్కువ ధరలకే పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్ళు చేయబడునని తెలిపారు. ఈ కంటి వైద్య శిబిరంలో వైద్యులు ఎస్. రాజు, గునపర్తి సునీల్ కుమార్, పాస్టర్ ఎం. జాను ప్రసాద్, ఎం. సుభాషిణి, ఎస్. నాగేశ్వరరావు, ఎస్. నాగేంద్ర, పి. రాజేష్, ఆదాము, మరియు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *