కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు లేవు—ఎన్ డి విజయ జ్యోతి.

పనిచేసే గ్రూపు, పని చేయని గ్రూపే ఉన్నాయ్.

జూన్ 12న. వై.ఎస్.షర్మిలా రెడ్డి కడపకు రాక.

కడప జిల్లా: మన న్యూస్: జూన్ 09: గుజరాత్ లో ఏఐసీసీ ఆమోదించిన తీర్మానాన్ని ప్రజలకు వివరించడానికి, జిల్లా సమస్యలను తెలుసుకోవడానికి మరియు పార్టీ పునర్నిర్మాణ దిశగా చర్యలు తీసుకోవడానికి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలారెడ్డి జూన్ 12న కడప పర్యటనను వస్తున్నారని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి సోమవారం ఇందిరా భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విజయ జ్యోతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాలను చూసింది. తిరుగుబాటు చేసినవారిని ఎదుర్కొనడంలో కాంగ్రెస్ పార్టీ కి అనుభవం ఎక్కువగా ఉందని పార్టీ లో గ్రూపులు రెండు మాత్రమే ఉంటాయని ఒకటి పనిచేసే గ్రూపు, రెండోది పని చేయని గ్రూపు. గ్రూపు ఇజాన్ని పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదు అని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షురాలిగా వై.ఎస్. షర్మిలారెడ్డి పార్టీ శ్రేణులను ఒక తాటిపైకి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. జూన్ 12న మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు కడప ఐ.ఎం.ఎ. హాల్లో జరగనున్న పార్టీవివిధ అంశాలపై సమీక్ష సమావేశాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయ జ్యోతి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లు, జమ్మలమడుగు, పొద్దుటూరు, కమలాపురం, పులివెందుల శివమోహన్ రెడ్డి, ఇర్ఫాన్ బాషా, మీగడ అశోక్ రెడ్డి, ధ్రువకుమార్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి అలీ ఖాన్, సిరాజుద్దీన్, గౌస్ పీర్, సంజయ్ కాంత, రహమతుల్లా ఖాన్, రఫీఖ్ ఖాన్, మూరతోటి విజయకుమార్, సుశీల్ కుమార్, నీలం, గౌరీ, వెంకటస్వామి, ముబారక్ , ముబారక్, రాజశేఖర్ రెడ్డి, పైరోజ్, మహబూబ్ బాషా, శీలం గంగయ్య, మైనుద్దీన్ ఖాన్, కమల్ భాష, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…