మన న్యూస్, కావలి :ఇబ్బంది లో ఉన్న నా బిడ్డలు చదువులకు పవన్ కళ్యాణ్ ఏ విధంగా సహాయం చేశారో…అలాగే వారు వృద్ధిలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ తరఫున నా బిడ్డలు పది మందికి ఉపయోగపడేటట్టు చూస్తాము… కీ.శే.మధుసూదన్ సతీమణి .కీ.శే.సోమిశెట్టి మధుసూదన్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ తరపున 50 లక్షల రూపాయలు అందజేసిన పర్యాటకశాఖ మంత్రి కందులు దుర్గేష్ , ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ పహల్గాం ఉగ్రవాద దాడి లో మరణించిన జనసేన క్రియాశీలక సభ్యులు కీ.శే.సోమిశెట్టి మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించి,పవన్ కళ్యాణ్ పిల్లల చదువుకు గాను ఆసరాగా తన వ్యక్తిగత సంపాదన నుంచి ప్రకటించిన రూ50 లక్షల చెక్కును ఈరోజు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ , ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ మదుసూదన్ కుటుంబ సభ్యులకు అందజేశారు. జనసేన కుటుంబ సభ్యులకు ఈ విధంగా జరగడం దురదృష్టకరమని 22 లక్షలు,23 లక్షలు చెక్కులను పిల్లల ఇద్దరికీ,ఐదు లక్షల చెక్కు తల్లిదండ్రులకు అందజేశారు.మధుసూదన్ లేని లోటు తీర్చలేనిది. జనసేన కుటుంబం లో ఒకరిని కోల్పోవడం బాధాకరం.బిడ్డల చదువుకై పవన్ కళ్యాణ్ పంపిన ఆర్థిక సహాయం ఉపయోగించి పిల్లలు వృద్ది లోకి తీసుకురండి.మీ కుటుంబానికి అన్ని విధాల జనసేన పార్టీ నాయకులు అందుబాటులో ఉంటారు.ఏ సహాయం కావాలన్నా మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు.ఎంతోమంది నాయకులను చూశాను పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని నేను చూడలేదు. చెప్పింది చెప్పినట్లుగా చేసారు.ఈ చెక్కుల విభజనలో ఆయన ఆలోచించిన విధానం మా మనసులకు హత్తుకుంది. నా బిడ్డల చదువులకు ఏ విధంగా ఆర్థిక సహాయం పవన్ కళ్యాణ్ చేశారో అదే విధంగా నా బిడ్డలు భవిష్యత్తులో వృద్ధి లోకి వచ్చిన తర్వాత వారిచేత కూడా సమాజానికి జనసేన పార్టీ తరఫున మా పిల్లలు కూడా ఉపయోగపడేటట్లు చూస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి శ్రీ కాందులు దుర్గేష్ ఏపీ టీడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,కావలి నాయకులు వెంకటసుబ్బయ్య,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందరరామిరెడ్డి, సీనియర్ నాయకులు నెల్లూరు కార్పొరేషన్ మెంబర్ నూనె మల్లికార్జున్ యాదవ్, లీగల్ సెల్ నాయకుడు శ్రీరామ్, కావలి ఇంచార్జ్ అలహరి సుధాకర్ జనేన నాయకుల బెల్లపు సుధా మాధవ్, జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, మహేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *