మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) హైదరాబాద్ లో అనారోగ్యంతో ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ,ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,ఏఐజీ హాస్పిటల్ చైర్మన్, వ్యవస్థాపకుడు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డా.నాగేశ్వర్ రెడ్డి లు కలిసి పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు..ఎమ్మెల్యే త్వరగా కోలుకొని ప్రజలకు సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. వైద్య ఆరోగ్య సిబ్బందికి మాట్లాడి మెరుగైన చికిత్సను అందించాలని మంత్రి డాక్టర్ ను సూచించారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *