హైకోర్టు ఉత్తర్వులు అయితే.. గుట్టు చప్పుడు వ్యవహారాలు ఎందుకు….?

  • శంఖవరం ప్రాజెక్ట్ అంగన్వాడీ కార్యకర్తల ఆరోపణలు…
  • అంగన్వాడీ కార్యకర్త ఎం. పద్మ కు న్యాయం చేయాలంటూ నిరాహార దీక్ష…

శంఖవరం మన న్యూస్ (అపురూప్): అంగన్వాడీ కార్యకర్త ఎం. పద్మ ను అక్రమంగా తొలగించారంటూ న్యాయం కోసం చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది.వివరాల్లోకి వెళితే… కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం పరిధిలోని రౌతులపూడి మండలం రామకృష్ణాపురం అంగన్వాడీ కేంద్రం కోడ్ నెంబర్ 0421181 కార్యకర్తగా ఎం.పద్మ 2013 లో ఒప్పంద పద్ధతిలో షరతులపై కార్యకర్తగా ఉద్యోగం పొందారు. నాటి నుంచి ప్రతీ ఏడాదీ ఒప్పందం పొడిగింపుతో 12 ఏళ్ళుగా నిరవధికంగా విధుల్లో కొనసాగుతూ వస్తుండగా ఆమెను ఈ మే నెల 16 న విధుల నుంచి తొలగించారు. ఈ కేంద్రం నిర్వహణా బాధ్యతలను అంగన్వాడీ సూపర్వైజరుకు అప్పగించారు. తొలగించిన కండీషనల్ అంగన్వాడీ కార్యకర్త ఎం.పద్మ స్థానంలో అదే రామకృష్ణాపురం గ్రామానికి చెందిన పసిల భవానీని వారాల వ్యవధిలో నియమించాలని ఆదేశిస్తూ కాకినాడ జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.దీంతో ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను అనుసరించి 12 ఏళ్ళ కండీషనల్ అంగన్వాడీ కార్యకర్త ఎం.పద్మను తొలగిస్తూ, ఆమె స్ధానంలో తాజా అంగన్వాడీ కార్యకర్తగా పసిల భవానీని నియమిస్తూ ప్రాజెక్ట్ డైరెక్టర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 2018 లో జారీ చేసిన అంగన్వాడీ కార్యకర్తల నియామక ఉత్తర్వులకు సంబంధించిన దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2019 లో కరోనా కారణంగా అసలు ఇంటర్వ్యూలనే నిర్వహించలేదని, అలాంటప్పుడు ఉద్యోగం ఎలా ఇస్తారని, అంతే కాకుండా 2013 – 2024 నుంచి నిరవధికంగా విధుల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కార్యకర్తలను తొలగించ వద్దని 18.11.2020 న నాటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నేడు ఎలా ఉల్లంఘిస్తారని ప్రస్తుతం ఉద్యమిస్తున్న అంగన్వాడీకార్యకర్తలు సిఐటియు నాయకులు ధ్వజమెత్తారు. అంతేకాకుండా అంగన్వాడి కార్యకర్త ఎం పద్మను ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్టు స్వయంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకుండా కనీసం విషయాన్ని తెలుపకుండా అక్రమంగా తొలగించారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులు అయితే కనీసం పద్మకు తెలియకుండా కొత్త అంగన్వాడీ కార్యకర్త నియామకం పై అధికారులు పంపిన ఆర్డర్ కాపీ విషయంలో ఎందుకు గుర్తు చప్పుడుగా వ్యవహరించారని మండిపడ్డారు. శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం నందు న్యాయం జరిగే వరకూ నిరాహార దీక్ష చేపడతామని, ఇప్పటికైనా శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ తప్పును తెలుసుకొని యధావిధిగా పద్మను ఉద్యోగంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. నేటి రెండోవ రోజూ నిరసన ఉద్యమ కార్యక్రమంలో జిల్లా సిఐటియు అధ్యక్షురాలు పద్మావతి, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ అనుబంధ శాఖ శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు బి.రత్నకుమారి, ప్రధాన కార్యదర్శి గెడ్డం బుల్లమ్మ, ఎమ్.సత్యవేణి, సీత, బి.అప్పలరాజు, నూకరత్నంసంఘీభావం తెలపడానికి వచ్చిన పిఠాపురం ప్రాజెక్ట్ అంగన్వాడి కార్యకర్త యేసు, తుని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడి కార్యకర్తలు, లంకవారం ఇన్స్పెక్టర్ అంగన్వాడి కార్యకర్తలు సహాయ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…