

మన న్యూస్, కడప /నెల్లూరు, మే 27: మహానాడులో పాల్గొనేందుకు తరలివచ్చిన నాయకులు, కార్యకర్తల ర్యాలీని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఘనంగా ప్రారంభించారు. కడపలోని విడిది కేంద్రం దగ్గర నుంచి పబ్బాపురంలో ఉన్న మహానాడు సభ ప్రాంగణం వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. నెల్లూరు నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా రావడంతో విడిది కేంద్రం పెద్ద కోలాహలం నెలకొంది. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు తెలుగుదేశం పార్టీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

