మన న్యూస్, నెల్లూరు, మే 27: నెల్లూరు డైకస్ రోడ్ కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసంలో మంగళవారం మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు తో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.కాకాణి గోవర్ధన్ రెడ్డి పై ప్రభుత్వం పెట్టిన అక్రమకేసు.. నిలవదని.. వారు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని ధైర్యంగా ఉండాలని వారు కుటుంబ సభ్యులకు సూచించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి కి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *