మన న్యూస్, కోవూరు:- రామచంద్రపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు 16 గంటల విద్యుత్ సరఫరాకు సమ్మతించిన అధికారులు.- ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రామచంద్రపురం రైతులు.రోజుకు 9 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యే రామచంద్రపురం గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలతో ట్రాన్స్ కో అధికారులు 16 గంటలకు పెంచారు. వివరాల్లోకి వెళ్తే రామచంద్రపురం వాసులు 150 ఎకరాలకు పైగా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వరి సాగు చేస్తుంటారు. చాలీ చాలని విద్యుత్ సరఫరాతో పంటకు సరిపడా నీళ్లు అందక ఏడాదికి ఒక్క పంట మాత్రమే పండించుకునే వారు. ఎండకాలం నీటి అవసరం ఎక్కువ కాబట్టి రెండో పంట వేసే సాహసం చేసే వారు కాదు. గత పాలకులకు చెప్పుకున్నా ఎవరూ స్పందించలేదు. తాము ఎదుర్కొంటున్న సాగునీటి సమస్య గురించి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి రామచంద్రపురం రామచంద్రపురం వాసులు మొర పెట్టుకున్నారు. ఆమె వెంటనే స్పంది విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి రామచంద్రాపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు 16 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రయత్నాలు ఫలించి రామచంద్రపురం గ్రామానికి 16 గంటల విద్యుత్ సరఫరాకు అందుబాటులోకి వచ్చింది. దీంతో వారికీ రెండో పంట వేసుకునేందుకు మార్గం సుగుమమైంది. ఈ సందర్బంగా రామాచంద్రపురం రైతులు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని అభినందించారు. విద్యుత్ సరఫరా వ్యవధి పెంచి తమకు రెండో పంటకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ని నెల్లూరు లోని ఆమె నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులతో పాటు Apspdc EE రమేష్ చౌదరి, బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, వైస్ ఛైర్మెన్ శివారెడ్డి, బుచ్చి పట్టణ 20 వ వార్డు కౌన్సిలర్ కత్తి శ్రీదేవి, బుచ్చి అర్బన్, రూరల్ మండల టిడిపి అధ్యక్షులు గుత్త శ్రీనివాసులు, బెజవాడ జగదీష్, ఇందుకూరుపేట టిడిపి అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి, టిడిపి నాయకులు కోడూరుకమలాకర్ రెడ్డి, మోర్ల మురళి, కత్తి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *