మన న్యూస్ సింగరాయకొండ :-

సింగరాయకొండ మండలం పాకల గ్రామానికి చెందిన రేవు నాగేంద్రబాబు కుమారుడు రేవు రాజేష్ (21) ఆటో ప్రమాదంలో దుర్మరణం చెందాడు. రాజేష్, సైకం సంతోషం లు కలిసి ఆటోలో, ఈ రోజు ఉదయం 11:50 గంటలకు పాకల గ్రామం నుంచి సింగరాయకొండకు ప్రయాణమవుతున్నారు.

పాకల గ్రామం దాటి, కోనేరు సమీపంలోకి రాగానే ఆటో డ్రైవర్ తన వాహనాన్ని వేగంగా, అజాగ్రత్తగా నడిపాడు. ఈ కారణంగా ఆటో అదుపుతప్పి కిందపడిపోయింది. ప్రమాదంలో రేవు రాజేష్ తలకు తీవ్ర గాయం కలిగి, రక్తస్రావం అయ్యింది. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా GGH ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. అయితే, మధ్యాహ్నం 1:28 గంటలకు వైద్యులు రాజేష్ మరణించినట్లు ప్రకటించారు.

ఈ ఘటనపై మృతుని తండ్రి రేవు నాగేంద్రబాబు ఫిర్యాదు మేరకు, సింగరాయకొండ ఎస్‌ఐ బి. మహేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *