జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి…సీఎస్ఆర్ నిధులపై ఎమ్మెల్యేతో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సమీక్ష

మన న్యూస్: కొత్తగూడెం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు సిఎస్ఆర్ నిధులు అందజేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశ్రమల ప్రతినిధులను కోరారు. జిల్లా కలెక్టరేట్కా ర్యాలయంలో బుధవారం ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావు, కోరం కనకయ్యలతో పాటు వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సామాజిక,విద్య, వైద్య రంగాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు కేటాయిస్తామన్నారు. ఇక్కడ ఉన్న సంస్థలు జిల్లా అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ ను తమ వంతు బాధ్యతగా రెండు శాతం నిధులను అందజేయాలని ఆయన కోరారు. గతంలో సిఎస్ఆర్ నిధుల కింద జిల్లాలో అన్ని నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులను విజయవంతంగా చేపట్టడం జరిగిందన్నారు. సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. సీఎస్ఆర్ నిధులను స్థానిక ప్రజాప్రతినిధుల సూచనల మేరకు అవసరమైన పనులకు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సింగరేణి, కేటీపీఎస్, ఐటిసి,నవభారత్,బీటీపీఎస్ యాజమాన్యాలకు చెందిన ఉన్నతాధికారులు,జీఎం ఇండస్ట్రీస్ తిరుపతయ్య,సీపీఓ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు….

  • Related Posts

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ ఫోరం ఆధ్వర్యంలో నారాయణ పేట జిల్లా పరిదిలోని మక్తల్ పట్టణ కేంద్రంలోని వైష్ణవీ మహిళల జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ…

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    మన ధ్యాస,నారాయణ పేట జిల్లా: తెలంగాణ రాబిన్ హుడ్, పేద ప్రజల ఆరాధ్య దైవం పండుగ సాయన్న అని.. సమాజంలో అట్టడుగు వర్గాల కోసం కృషిచేసిన మహనీయుడు పండుగ సాయన్న అని మక్తల్ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు కోళ్ల వెంకటేష్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.