

మన న్యూస్ ,గూడూరు ,మే 19:అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 12 లక్షల 98 వేల 788 రూపాయుల- 9 చెక్కులను పంపిణీ చేసిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్.టీడీపీ తిరుపతిజిల్లా రైతు విభాగ కార్యనిర్వహక కార్యదర్శి,పెన్న చెరువు సాగునీటి సంఘం అధ్యక్షులు నెల్లూరు మోహన్ రెడ్డి, టీడీపీ తిరుపతి జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ పాల్గొన్నారు .లబ్ధిదారుని వివరాలు…గూడూరు పట్టణం కు సాధుపేట సెంటర్ కి చెందిన ముప్పాల సుబ్బమ్మ కి – 55000, మారిమాసి ధనమ్మ కి -66900, చిల్లకూరు మండలం తిప్పగుంట పాలెం గ్రామానికి చెందిన సైదాపల్లి ప్రేమ్ సంపత్ కుమార్ కి 351842, పల్లివాని దిబ్బ గ్రామానికి గ్రామానికి చెందిన కాల్తి రెడ్డి బుజ్జమ్మ కి – 68572, కొత్తపాలెం గ్రామానికి చెందిన ఇరగరాజు వెంకటమ్మ కి – 44070..కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపల్లి గ్రామానికి చెందిన యానాటి రజని 43400…వాకాడు మండలం – బాలిరెడ్డిపాలెం గ్రామానికి గుండాల అపర్ణ కి 552886..చిట్టమూరు మండలం మన్నెమాల గ్రామానికి చెందిన తిరుపాలు కి 65918/- సోమసముద్రం గ్రామానికి చెందిన దూడల జ్యోత్స్న కి 50200.ఈ సందర్బంగా లబ్ధిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చుతో కూడిన చికిత్స చేయించుకోవటం కోసం ఎమ్మెల్యే ని సహాయం కోసం అడిగితే అడిగిన వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు ఆర్థిక సహాయం అందజేశారని, వారు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోమని ఈ సందర్భంగా సునీల్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
