

నెల్లూరు ,మన న్యూస్ ,మే 13: నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లో ఉన్న ఓవెల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మంగళవారం విడుదల చేసిన సి.బి.ఎస్ ఈ టెన్త్ 2024-25 ఫలితాలలో మంచి మార్కులు సాధించడమే కాకుండా 100% ఉత్తీర్ణత సాధించారు.ఈ విద్యా సంస్థల చైర్మన్ వేణు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థని విద్యార్థులను అభినందించారు.పాఠశాల స్థాయి ఫలితాలలో పోలిశెట్టి హిమ శ్రీ 474 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది. షేక్ నేహా భాను 460 మార్కులతో ద్వితీయ స్థానం ,మామిడి కార్తీక్ 448 మార్కుల తో తృతీయ స్థానంలో నిలిచారు. 45 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు గాక అందులో 42 మంది ప్రధమ శ్రేణులు, ముగ్గురు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.: ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది . ఈ అభినందన కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ ఆర్. వేణు, సీఈఓ ఆర్ ప్రమీల ,జిఎం మహాదేవన్ ఈడివి బాలు ,డీజీఎం శ్రీనివాసులు మరియు ప్రిన్సిపల్ వంశీకృష్ణ పాల్గొన్నారు.
