

మనన్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ఒడ్డెపల్లి గ్రామంలో ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ తల్లి వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కుస్తీ పోటీలను తిలకించేందుకు మహారాష్ట్ర కర్ణాటక బిచ్కుంద నారాయణఖేడ్ జహీరాబాద్ తదితర ప్రాంతాల నుంచి మరల యూదులు అధికల సంఖ్యలు హాజరయ్యారు. ఉదయం కొబ్బరికాయకు నుంచి మొదలుకున్న కుస్తీ పోటీలు 500,1000,1500,2000 వరకు కొనసాగాయి.కుస్తీ పోటీల్లో గెలుపు పొందిన మరల యోధులకు నగదును అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజాపండరి, మాజీ ఎంపిటిసి రాజారాం,మాజీ సర్పంచ్ విఠల్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్,మాజీ ఉప సర్పంచ్ అంజయ్య,తదితరులు ఉన్నారు.
