మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):
ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ పుట్టినరోజు సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చైర్మన్ వాగు రాజేష్,ఆస్పత్రి సూపర్డెంట్ శైలజా శనివారం చలివేంద్రం ప్రారంభించారు.ఈ సందర్భంగా వాగు రాజేష్ మీడియాతో మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రం ప్రారంభించడం చాలా సంతోషంగా ఆయన అన్నారు.ప్రతి సోమవారం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.అంతే కాకుండా దాతల సహకారంతో షెడ్డు నిర్మించామని ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆసుపత్రి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.అలాగే ఆసుపత్రి సూపర్డెంట్ సైలజ మాట్లాడుతూ వాగు రాజేష్ చైర్మన్ అయ్యాక ఆస్పత్రి అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా ఆయన పనిచేస్తున్నారని ఆమె అన్నారు.అనంతరం రాజేష్ పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో, వైద్యులు ఎన్ రఘుపతి,కే లావణ్య, టిడిపి నాయకులు ఋగత శ్రీనివాసరావు,సామంతుల గోపి,రాతికింద సతీష్,మామిడి శ్రీను,అనంతారపు రాజు,సిరి ఫుడ్ కృష్ణ, దేవకి కృష్ణ, ఆసుపత్రి సిబ్బంది పరిమళా కుమారి, చక్రవర్తి,గోడత రాజు,తదితరులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *