

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం: మన న్యూస్: మే 2: బ్రహ్మంగారిమఠం మండలంలో ఆన్లైన్ పేరుతో పాత రికార్డులను మాయం చేస్తున్నారని అఖిలభారత యువజన సమైక్య AIYF కడప జిల్లా పెదుల పల్లి ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ2009-10 సంవత్సరం నుండి ఆన్లైన్ రికార్డు మొదలైంది. 2009 ముందు ఏదైతే మన్యువల్ రికార్డు ఉందో ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ రికార్డుల పేరు చెప్పి మాన్యువల్ రికార్డులను బ్రహ్మంగారిమఠం మండల రెవెన్యూ అధికారులు మాయం చేస్తున్నారు. ప్రజలు వచ్చి మాన్యువల్ రికార్డులు అడుగుతుంటే క్రింది స్థాయి vro నుండి ఎమ్మార్వో స్థాయి అధికారి వరకు ఎవరు కూడా ప్రజలకు సరిగా స్పందించడం లేదు. ఎవరైనా పేద ప్రజలు ఆన్లైన్ లో తమభూమి లేకుంటే మేము ఆన్లైన్ చేపించుకోవాలి మాకు మాన్యువల్ ఆడంగులు,వన్ బి ఇవ్వండి, అని అడిగితే రికార్డు మా దగ్గర లేదు, మాకు సంబంధం లేదు, అని బదులిస్తున్నారు.భూ కబ్జాదారులకు భూబకాసురులకు,వేలకు వేలు డబ్బులు ఇచ్చే నాయకులకు ఈ మండలంలో అధికారులు నిమిషాల్లో పనులు చేస్తున్నారు.తప్ప డబ్బు లేని పేదవారికి ఈ అధికారులు స్పందించడం లేదు. అందువల్లనే గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితులకు సంవత్సరం దాటినా కూడా నష్టపరిహారం రాకపోవడానికి కారణం అభూములు భదితులవే అని అధికారులకు తెలిసినప్పటికీ కేవలం ఆన్లైన్ లేని కారణంగా వారికి ఇంకా నష్టపరిహారం ఇవ్వలేదు. ఎంతమందికైతే ఆన్లైన్ లేవో అవన్నీ మాన్యువల్ అడంగల్ పరిశీలించి పట్టాదారు పాస్ బుక్ రికార్డులో ఉన్నదా లేదా పరిశీలించి వారికి తక్షణమే ఆన్లైన్ చేసి వారికి నష్టపరిహారం వచ్చే విధంగా జాయింట్ కలెక్టర్ మరియు బద్వేల్ ఆర్డిఓ చొరవ చేయాలి.సంవత్సర కాలంగా ఇంకా న్యాయం చేస్తామంటున్నారు.గానీ ఫైల్ అయితే ముందుకు కదలడం లేని పరిస్థితి. ఎవరైతే మానువల్ రికార్డులో అర్హులై ఉన్నారు వారికి కచ్చితంగా అధికారులు రికార్డులు పరిశీలించి ఆన్లైన్ చేసి వారికి డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.NH-67 జాతీయ రహదారి విస్తరణకు భూములు ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు సచివాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని ఆయన మండిపడ్డారు.తక్షణమే జిల్లా కలెక్టర్ గారు వీటిపైన విచారణ జరిపి గ్రీన్ ఫీల్డ్ హైవే భూ బాధితులకు మరియు NH-67లో న్యాయం జరగని రైతులకు తక్షణమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైనా ప్రజలు రెవెన్యూ కార్యాలయం కు వచ్చినప్పుడు రెవిన్యూ అధికారులు వారిపట్ల గౌరవంగా మాట్లాడేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.గ్రీన్ ఫీల్డ్ భుభాదితులకు మరియు NH-67 భుభాదితులకు తక్షణమే న్యాయం చేయకపోతే అఖిల భారత యువజన సమాఖ్య AIYF మరియు భారత కమ్యునిస్టు పార్టీ సీపీఐ అధ్వర్యంలో లో ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.