మనన్యూస్,జోగులాంబ గద్వాల:మానవపాడు 44వ. జాతీయ రహదారిపై శనివారం రాత్రి 7 గంటల నుంచి 7:30 నిమిషాల సమయంలో జరిగింది పూర్తి సమాచారం:- నాగర్ కర్నూలు జిల్లా కోడేర్ మండలం మైలారం తండాకు చెందిన కృష్ణ 28 సం ఏపీ కర్నూలు పట్టణంలోని ప్రైవేటు వెంచర్ లో ఉద్యోగం పనిచేస్తున్నాడూ పని ముగించుకున్ని ఆదివారం రోజు సొంత ఊరికి వెళ్లేందుకు రాత్రి కర్నూలు నుంచి బైక్ పై వెళ్లేందుకు అదే క్రమంలో మానవపాడు గ్రామానికి చెందిన ఏఎస్ఐ సమద్ తన డ్యూటీ గద్వాల జిల్లాలో ముగించుకొని మానవపాడు క్రాస్ రోడ్డు పై దిగి జాతీయ రహదారి దాటుతుండగా బైక్ పై వెళుతున్న కృష్ణ ఢీకొన్నాడు ఈ ప్రమాదంలో ఏఎస్ఐ సమద్ ఒకవైపు సమద్ మరోవైపు కృష్ణ రోడ్డు పై పడిపోయారు గుర్తుతెలియని రెండు కార్లు ఒకే సారి కృష్ణ పై వెళ్లడంతో కృష్ణ గాయాలుకావడంతో హుటాహుటిన అంబులెన్స్ ద్వారా కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు అప్పటికే కృష్ణ అనే వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఏఎస్ఐ సమద్ కు గాయాలు కావడంతో ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు. కృష్ణ కు రెండు నేలల క్రితం కృష్ణ మేనకోడలు తో ఎంగేజ్మెంట్ అయింది అని సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *