పోస్టుమార్టం నిమిత్తమై గద్వాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలింపు

వ్యక్తి ఆచూకీ తెలిసిన వాళ్లు మల్దకల్ ఎస్సై సెల్ : 8712670295 సంప్రదించగలరు
ఎస్సై.నందీకర్
మల్దకల్ మండలం
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 27

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని పెద్దపల్లి పావనం పల్లి గ్రామాల మధ్య శివారులో శనివారం అందాజా మధ్యాహ్నం 3 నుండి 4 గంటల సమయంలో కోళ్ళ ఫారం కు అందుబాటులో గుర్తుతెలియని వ్యక్తి చనిపోయిన విషయాన్ని స్థానికులు గుర్తించి మల్దకల్ ఎస్ఐ.నందీకర్ కు సమాచారం అందించారు.విషయం తెలిసిన వెంటనే మల్దకల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి,పోస్టుమార్టం నిమిత్తమై గద్వాల జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు, అదేవిధంగా చనిపోయిన వ్యక్తిని ఎవరైనా గుర్తించినట్లయితే మల్దకల్ ఎస్సై నంధీకర్ సెల్ నెంబర్ 8712670295 కు సమాచారం ఇవ్వాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *