

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: కడప జిల్లా SP E. G. అశోక్ కుమార్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు మైదుకూరు సబ్ డివిజనల్ ఆఫీసర్ జి. రాజేంద్రప్రసాద్ గారి ఆధ్వర్యంలో బద్వేల్ అర్బన్ ఇన్స్పెక్టర్ M.రాజగోపాల్, SI లు M. సత్యనారాయణ, K. జయరామి రెడ్డి, బి కోడూరు SI k. C రాజు, బద్వేల్ రూరల్ SI K.శ్రీకాంత్, అట్లూరు SI రామకృష్ణ, మరియు సిబ్బంది ది తో కలిసి బద్వేల్ టౌన్ లోని ఐలమ్మ కాలనీ, నందు నాకాబంది నిర్వహించి అలాగే ఆ ఏరియాలో గల పాత నేరస్తులు మరియు సస్పెక్ట్ లు, రౌడీ షీటర్ ఇండ్లలో తనిఖీ చేసి ఏమైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపకారం చర్యలు తీసుకుంటామని తెలియజేయడమైనది. మట్కా మరియు గ్యాంబ్లింగ్, అక్రమ గంజా గురించి మరియు సైబర్ నేరాల గురించి మహిళలు మరియు చిన్నపిల్లలపై జరిగే నేరాల గురించి వేసవికాలంలో పిల్లలు ను బావులు చెరువులు,కుంటల దగ్గరికి పోకుండా చూసుకోవాలని అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ల ఏరియాలోకి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చిన ఏదైనా సమాచారం ఉన్న యెడల పోలీసులకు 112 ఫోన్ చేసి తెలియజేయవలెనని చెప్పడమైనది.