

విమానాశ్రయంలో సి.యం చంద్రబాబు, లోకేష్ కు స్వాగతం పలికిన డాలర్స్ దివాకర్ రెడ్డి
Mana News :- తిరుపతి నవంబర్ 17, (మన న్యూస్ ) ,చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే , సి.యం చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ కు రేణిగుంట విమానాశ్రయంలో డాలర్స్ గ్రూప్ అధినేత,టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి స్వాగతం పలికారు. అదే విధంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని నారావారి పల్లెకు తీసుకువెళ్ళే ఏర్పాట్లు లో నారా లోకేష్ వెంట ఉన్నారు.అనంతరం నారావారి పల్లెలో వారి నివాసంలో నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.వారి కుటుంబ సభ్యులకు డాలర్స్ దివాకర్ రెడ్డి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ప్రభుత్వ అధికార లంచనాలతో అంత్య క్రియలు జరిగాయి.పాడె మోసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లోకేష్ ,కుటుంబ సభ్యుల వెంట డాలర్స్ దివాకర్ రెడ్డి,మాహా రాష్ట్ర గవర్నర్ సి.పి రాధా కృష్ణన్,చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ,సినీ ప్రముఖులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు,టిడిపి,బిజెపి ,జనసేన నాయకులు పాల్గొన్నారు.