

కడప జిల్లా: గోపవరం: మన న్యూస్: ఏప్రిల్ 24: బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని గోపవరం మండలం రాచాయపేట రైతు సేవా కేంద్రం లో చెన్నవరం గ్రామం లో మట్టి నమూనాలను శాస్త్రీయంగా సేకరించడం జరిగింది. ఒక ఎకరా పొలంలో నేల రంగును బట్టి 3 నుండి 4 చోట్ల 15 సెంటీ మీటర్ లోతులో సేకరించి 4 భాగాలుగా విభజించి ఎదురెదురు భాగాలను తీసి వేసి , అలా రెండు మూడు సార్లు చేసి వచ్చిన మట్టిని కవర్ లో సేకరించి రైతు వివరాలు సేకరించి నమూనాలు భూసార పరీక్ష కేంద్రం ఊటుకూరు కడప కు పంపాలి. QR కోడ్ జత పరచాలి. రైతుతో సెల్ఫీ ఫోటో అప్లోడ్ చేయాలి. దీనివల్ల భూసార స్థాయి, సేంద్రీయ కర్బనం శాతం కనుకొన వచ్చును.
భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకం చేపట్టాలి. తదనంతరం రైతు సేవా కేంద్రం రాచాయ పేట ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.పాలవెల్లువ గ్రామ సభ లో పాల్గొని ఫార్మర్ రిజిస్ట్రేషన్, విశిష్ట గుర్తింపు సంఖ్య, యాంత్రీకరణ, PMDS, ప్రకృతి వ్యవసాయ విధానాలు పై అవగాహణ కల్పించడం జరిగింది. అనంతరం వేసవిలో సాగు చేస్తున్న పెసర పంట ను ఈ పంట నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీ ఏ. ఓబయ్య, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది జ్యోతి, సుధారాణి, FPO CC సుదర్శన్, సచివాలయ సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.