రెవెన్యూ, అధికారులది ఆర్భాటపు, హడావిడి ప్రచారాలే—సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ—ఘాటు విమర్శ.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 23: బద్వేల్ నియోజకవర్గంలోని కాశినాయన, కలసపాడు, అట్లూరు మండలాలలో జరిగిన భూ అక్రమాలపై రెవెన్యూ అధికారులు కేవలం ఆర్బాటపు ప్రకటనలు చేస్తూ హడావుడి పర్యటనలు చేస్తున్నారు, తప్ప నేటి వరకు ఒక్క సెంటు భూమి కూడా స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేవని ఒక్కరికి కనీసం నోటీసు కూడా పంపలేదని ఈ భూ అక్రమాలపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయించి వారికి సహకరించిన ఇంటి దొంగలపై చట్టపరమైన చర్యలు తీసుకోని తమ వృత్తి పట్ల తమ నిజాయితీని నిరూపించుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు సంగటి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం తమ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో తమ పార్టీ నాయకులతో కలిసి వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా సంగటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, బద్వేల్ నియోజకవర్గంలో దాదాపుగా గత ప్రభుత్వ హయాంలో 30 వేల ఎకరాల పైబడి ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని నాటి ప్రభుత్వంలో క్రియాశీలకపు పాత్ర పోషించిన కొంతమంది బడా బడా నాయకులు తమకున్న పలుకుబడిని ఉపయోగించుకొని కొంతమంది పేదలను మభ్యపెట్టి వారిని లోపర్చుకొని కొంత భూమి తమ పేరు మీద ఆన్లైన్ చేయించుకుని దాని మాటున ఆ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూమిని సైతం ఆక్రమణ చేసుకొని దర్జాగా కబ్జా చేసి వాటిలో ఫామ్ హౌస్ సైతం నిర్మించుకొని పంటలు సాగు చేస్తూ యదేచ్ఛగా పెద్ద మనుషులుగా తిరుగుతున్నారని ఈ విషయాలు ప్రభుత్వాధికారుల దృష్టికి పదేపదే రోజు వారి కథనాలుగా పత్రికా మిత్రులు వెలువరిస్తున్నా రెవెన్యూ అధికారులలో చలనం లేకపోవడం చూస్తుంటే వారి నిజాయితీపట్ల ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయని వారు ఆరోపించారు. కాశి నాయన కలసపాడు మండలాలలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సర్వే నెంబర్ల వారీగా వివరాలు తెలిసినప్పటికీ రెవెన్యూ అధికారులు నామమాత్రపు పర్యటనలు ఆర్బాటపు ప్రకటనలు చేస్తూ కాలం గడుపుతున్నారు తప్ప నేటికీ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకున్న సందర్భాలు మరియు ఒక్క సెంటు ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్న సందర్భాలు లేకపోవడం, ఈ కబ్జాలకు సహకరించిన ఒక్క రెవెన్యూ అధికారిపై చర్యలు నేటికీ లేకపోవడం చూస్తుంటే రెవెన్యూ అధికారులకు కబ్జాదారులకు మధ్యలో లోపాయికారి ఒప్పందాలు జరిగి లక్షలాది రూపాయలు చేతులు మారాయని ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయని దీనిపై జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీవో గారు పత్రికాముఖంగా సమాధానం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పేదవాడు తమ గూడు కోసం చిన్నపాటి గుడిసె వేసుకుంటే క్షణాల్లో వచ్చి ఆ గుడిసెలను తొలగించి వారిపై కేసులు నమోదు చేసే రెవెన్యూ అధికారులు నేడు ఇంత మొత్తంలో భూములు ఆక్రమణ జరుగుతుంటే మౌనం ఎందుకు వహిస్తున్నారో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అలాగే గతంలో ఆర్డీవో గా పనిచేసిన ఆకుల వెంకటరమణ గారు మరియు కలసపాడు కాశినాయన అట్లూరు మండలాల రెవెన్యూ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న సందర్భంలో తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సహకరించిన రెవిన్యూ సిబ్బందిపై శాఖపరమైన చర్యలకు ఆదేశించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో కబ్జా భూములలో ప్రత్యక్ష పర్యటనలు చేపట్టి మీ లోపాలను ప్రజలు పత్రికలు ఎదుట పెడతామని వారు హెచ్చరించారు.
ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటి సభ్యులు చంద్రమోహన్ రాజు, జకరయ్య మరియు నియోజకవర్గ పార్టీ నాయకులు రామరాజు, నారాయణ, జయరామరాజు, చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా