

మనన్యూస్,తిరుమల:తిరుమలలో అఖిలాండడం వద్ద ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న అఖిలాండడం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన సందర్భంగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సీఎం ఆయురా రోగ్యాలతో ఉండాలని కోరుతూ 750 కొబ్బరికాయలు కొట్టడంతో పాటు ఏడున్నర కిలోల కర్పూరాన్ని స్వామివారికి సమర్పించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం అలుపెరగని పోరాట యోధుడు ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. మార్గం మనందరికీ ఆదర్శనీయమన్నారు. ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం మనమందరం పాలు పంచుకుందామని తెలియజేశారు. ప్రజాదరణ ఉన్న నాయకుడు చంద్రబాబునాయుడు అని తెలిపారు. బడుగు బలహీన వర్గాల జీవితాలలో చిరస్థాయిగా నిలిచిపోయే వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. ఒక గొప్ప నాయకుడు ఆదర్శంగా తీసుకుని పార్టీలో పని చేయడంఅదృష్టంగాభావిస్తున్నాను. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రూపేంద్ర వర్మ, రాజు యాదవ్, సుబ్బు, తదితరులు పాల్గొన్నారు.