

తవణంపల్లి నవంబర్ 16 మన న్యూస్
గ్రామకంఠంలో జరిగే భూముల రిజిస్ట్రేషన్లు పంచాయతీ కార్యదర్శికి అధికారాలు ఇవ్వబడ్డాయని తవణంపల్లి మండల తహసిల్దార్ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ కంఠంలో జరిగే రిజిస్ట్రేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం మా దగ్గర ఉందని రెవిన్యూ శాఖలో నిర్దిష్టమైన ఉత్తర్వులు ఉన్నాయని వాటి అన్నింటిని కూడా గత ప్రభుత్వం ఉండగానే నిషేధిత జాబితా నుండి గ్రామ కంఠ భూములను తొలగించ బడ్డాయని తెలిపారు. అనంతరం గ్రామకంఠ భూములు రిజిస్ట్రేషన్ కి అర్హత కలిగి ఉన్నాయి. గ్రామ కంఠం భూములు రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు సబ్ రిజిస్టార్ శాఖ వారు రెవిన్యూ శాఖ నుండి ధ్రువపత్రాన్ని అడుగుతున్నారని తెలిపారు. సబ్ రిజిస్టర్ నుండి విఆర్ఓ నుండి తీసుకున్న ధ్రువ పత్రాలకు ఎలాంటి అర్హత లేదని, వాటికి సంబంధించి వీఆర్వో ధృవీకరించాల్సిన అవసరం లేదని గ్రామకంఠం పూర్తి అధికారం పంచాయతీ కార్యదర్శులకు ఇదివరకే ఉత్తర్వులు జారీ చేయబ డ్డాయని పంచాయతీ కార్యదర్శులు ధ్రువపత్రాలు జారీ చేయడానికి పూర్తి అర్హత కలవారని వీఆర్వోల కు ఇందులో ఎలాంటి అధికారం లేదని తెలిపారు. ఇదివరకే నేను చూసిన కేసులు గ్రామకంఠ భూములకు సంబంధించి విలేజ్ సర్వేయర్ నుండి సంతకాలు అడుగుతున్నారని నా దృష్టికి రావడం జరిగిందని కానీ ఈ విషయంలో వారికి కూడా సంబంధం లేదని, పంచాయతీ కార్యదర్శి కి పూర్తి అధికారాలు ఉత్తర్యులు ఇచ్చినప్పుడు గ్రామ రెవెన్యూ లో ధ్రువీకరణ పత్రం మంజూరు చేయడానికి అవకాశం లేదు, ధ్రువీకరణ పత్రాల రిజిస్ట్రేషన్ సంబంధించి తవణంపల్లి మండలంలోని ప్రజలు విషయాలను గ్రహించి పంచాయతీ కార్యదర్శులను సంప్రదించాలని తెలిపారు.