మన న్యూస్ శంఖవరం (అపురూప్): పేదవాడి చదువు. పదునైన ఆయుధం వంటిది అని చదువుల తల్లి కొంకిపూడి నవ్య శ్రీ కి శంఖవరం అంబేద్కర్ కాలనీ నివాసులు అభినందనలు తెలిపారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం అంబేద్కర్ కాలనీకి చెందిన కొంకిపూడి రాజు, తల్లి దుర్గ ప్రధమ సంతానం కొంకిపూడి నవ్య శ్రీ. వ్యవసాయ పనులు చేస్తూ జీవనం కొనసాగించే కుటుంబం లో పుట్టి ఆర్థిక పరిస్థితులతో సతమతమవుతున్న పరిస్థితులు ఎన్నో.. ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి సరైన వసతులు ఆర్థిక స్తోమత లేక శంఖవరం స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరో తరగతి లో చేరి ప్రతి ఏటా ప్రతి తరగతులో ప్రథమ స్థానాన్నికైవసం చేసుకుంటూ, ప్రధమ స్థానానికి అలవాటు పడి పదవ తరగతిలో 533/600 సాధించి కస్తూర్బా గాంధీ విద్యాలయానికే ఘనత తెచ్చింది. 2024-2025 సంవత్సరంలో 11వ తరగతి ఎంపీసీ చదువుతూ ఇటువలే చివరి పరీక్షలకు హాజరయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం శనివారం వెల్లడించిన ఫలితాలలో కాకినాడ జిల్లా లో గల శంఖవరం, తొండంగి తుని, కోటనందూరు మండలాలలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో శంఖవరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన కొంకిపూడి నవ్య శ్రీ 11వ తరగతి ఎంపీసీ 438/470 మార్కులు సాధించి కాకినాడ జిల్లాలో గల నాలుగు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా శంఖవరం అంబేద్కర్ నగర్ కాలనీ నివాసులు చదువుల తల్లి మా కాలనీలో పుట్టిందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శంకవరం మండల విద్యాశాఖ అధికారి సూరిశెట్టి వెంకటరమణ, శుభాకాంక్షలు బాలికల విద్యాలయ ప్రిన్సిపాల్ బి. బాల కుమారి, కేజీబీవీ సిబ్బంది, శంఖవరం స్థానిక జై భీమ్ యూత్ సభ్యులు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *