మన న్యూస్ : శేరిలింగంపల్లి నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్తు మార్గదర్శకాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు.గురువారం కొండాపూర్ లోని సంస్కృతి గ్రూప్ అఫ్ పాఠశాలలో  ఏర్పాటు చేసిన ద్రోనాచార్య ఛాంపియన్స్ లీగ్ -2k24 చిల్డ్రన్స్ డే ను పురస్కరించుకుని పాఠశాల  ఛైర్మెన్, ఫౌండర్ లక్ష్మణ్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్  ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జవహర్ లాల్ నెహ్రు  చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశేష వేషాధారణలో చిన్నారులు ఆటపాటలతో ఉత్సాహపరిచారు. ఈ సందర్బంగా ఆయా పోటిల్లో గెలుపొందిన విద్యార్థులకు కార్పొరేటర్ రాగం జ్ఞాపికలను అందజేశారు. అనంతరం కార్పొరేటర్  మాట్లాడుతూ.దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టమని అందుకు ఆయన పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్ డే ను జరుపుకుంటామని అన్నారు. నెహ్రూ కి పిల్లలు అంటే చాలా ఇష్టమని నేటి బాలలే రేపటి పౌరులు అనే లక్ష్యంతో పిల్లల అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు అమలు చేశారని అన్నారు. ఆయన కుటుంబం అంతా ప్రజల కోసం, దేశం కోసం త్యాగం చేశారని అన్నారు.. వారిని ఆదర్శంగా తీసుకొని పిల్లలు అందరూ ఉన్నత చదువులు చదివి దేశానికి సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలోమాజీ  ఛైర్మెన్ తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వి ప్రకాష్ ,బాస్కెట్ బాల్ కోచ్ పవన్, స్కూల్ డైరెక్టర్ భవాని, ప్రిన్సిపల్స్ జ్యోతిర్ మయి, సుబ్బలక్ష్మి, జయంతి, స్కూల్ స్టాఫ్, విద్యార్థి విద్యార్థినుల తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *