

మన న్యూస్,ఎస్ఆర్ పురం :- ఏపీయూడబ్ల్యూజే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరుమల ను గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన నాయకులు ఘనంగా సన్మానించి సత్కరించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ప్రతిస్పందించి వారి సమస్యకు పత్రిక రూపంలో అధికారులకు తెలియజేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి కృతజ్ఞతలు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ మహేష్ , ఎస్ ఆర్ పురం మండల ఉపాధ్యక్షుడు చందు,, జనసేన నాయకులు సురేష్ నాయుడు దేవా పాల్గొన్నారు.