కొండాపురం జులై 27, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, యువ నేత నారా లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కాకర్ల సురేష్ తో కలిసి కొండాపురం మండలం సాయి పేట గ్రామపంచాయతీ ఇస్కపాలెంలో పాల్గొన్న మాజీ మండల పార్టీ అధ్యక్షులు చెరుకూరి వెంకటాద్రి నాయుడు, మరియు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్, ఈ సందర్భంగా మండల నాయకులు, అన్ని గ్రామాల నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనవిజయం చేశారు.ఈ రెండేళ్లగా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తిరిగి ప్రజలకు వివరించడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుందని వారు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీల మేరకు రెండు సంవత్సరాల వ్యవధి కాలంలోనే ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కంభం విజయనగరం రెడ్డి , మాజీ చైర్ పర్సన్ చంచల్ బాబు యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు పోలినేని చంద్రబాబు నాయుడు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చెరుకూరి వెంకటాద్రి నాయుడు ,క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు,కొమ్మి గ్రామ నాయకులు, కార్యకర్తలు,కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *